Anchor Shyamala: క్రికెట‌ర్ భువనేశ్వర్‌తో రిలేషన్‌ బ‌య‌టపెట్టిన శ్యామల

Anchor Shyamala: సోష‌ల్ మీడియాలో స్పందించిన శ్యామ‌ల‌ 'అవునా.. ఈ సంగ‌తి నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది' అంటూ సెటైర్‌ వేశారు

Samba Siva Rao
Updated on: 8 May 2021 4:19 PM IST
Bhuvaneswar and Syamala
X

శ్యామల, క్రికెట‌ర్ భువనేశ్వర్‌

Anchor Shyamala: టాలీవుడ్‌ యాంకర్‌ శ్యామల తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితురాలే. టీవీ షోలు, ఆడియో ఫ‌న్ క్ష‌న్ల‌లో త‌న యాంక‌రింగ్ తో అద్భుతంగా ఆక‌ట్టుకుంటుంది.పలు సినిమాల్లో కూడా నటించింది శ్యామల. ప్ర‌స్తుతం టీవీ షోలు, ఆడియో ఫంక్షన్లు లేక పోయిన‌ప్ప‌టికీ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా శ్యామలకు క్రికెటర్ టీమిండియా బౌల‌ర్ భువనేశ్వర్‌కు మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా అంటూ సోషల్‌ మీడియా వేదిక‌గా వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రో్ అడుగు ముందుకేసిన నెటిజ‌న్లు వీరిద్దరు అక్కా, తమ్ముళ్లని అందుకే వీరిద్దరికి దగ్గరి పోలికలుంటాయని మీమ్స్‌ క్రియేట్‌ చేశారు.

అయితే ఈ వార్తలపై శ్యామల స్పందించింది. క్రికెట‌ర్ భువనేశ్వర్‌కు మ‌ధ్య సంబంధం గురించి నోరు విప్పింది. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో స్పందించిన శ్యామ‌ల‌ 'అవునా.. ఈ సంగ‌తి నాకే తెలియదు వాళ్లకేం తెలుస్తుంది' అంటూ సెటైర్‌ వేశారు. దీంతో శ్యామల, భువనేశ్వర్‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ అంటూ సోష‌ల్ మీడియాలో వైరలవుతున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

ఇటీవలే శ్యామ‌ల‌ భర్త న‌టుడు నర్సింహారెడ్డిపై చీటింగ్‌ కేసుతో వార్త‌ల్లో నిలిచింది. తన దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నర్సింహారెడ్డిపై ఓ మహిళ రాయదుర్గం పీఎస్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది.

నర్సింహారెడ్డిని త‌న‌ డబ్బులు ఇవ్వాల‌ని అడిగితే బెదిరించడమే కాకుండా, వేధింపులకు కూడా గురిచేశాడని ఆరోపించింది. తాజాగా ఈ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నర్సింహారెడ్డి తనపై సోషల్‌ మీడియాలో వస్తోన్న కథనాలపై స్పందిస్తూ.. తనపై తప్పుడు కేసు పెట్టారని, త్వరలో నిజనిజాలేమిటో అందరికి తెలుస్తాయ‌ని నర్సింహారెడ్డి వెల్ల‌డించాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story