Tamannaah Parents tests Positive for Covid19: కరోనా బారిన పడ్డ తమన్నా తల్లిదండ్రులు..

Tamannaah Parents tests Covid Positive: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా.

S. Srikanth
Updated on: 31 Aug 2020 6:45 PM IST
Tamannaah Parents tests Positive for Covid19: కరోనా బారిన పడ్డ తమన్నా తల్లిదండ్రులు..
X

Tamannaah (File Photo)

Tamannaah Parents tests Covid Positive: ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది కరోనా. దీనివల్ల ధనిక, పేద, అధికారం, అనధికారం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అందరినీ ఒక గాటన పెట్టి సోకుతోంది. అయితే దీనిని ఎదురించి, ధైర్యంగా కొంతమంది కోలుకుంటే, మరి కొంత మంది ఎదురొడ్డి పోరాటం చేయలేక అశువులు బాస్తున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.. కొరోనా బారిన పడుతున్న సెలబ్రిటిల సంఖ్య కూడా బారిగా పెరుగుతుంది.. షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వెంటనేసీరియల్ నటులు ఒక్కొక్కరు కరొనా బారిన పడగా తాజాగా సినిమా వారి జాబితా కూడా పెరిగింది.. సినిమారంగం, రాజకీయం, క్రీడారంగం ప్రతి రంగంలోని సెలబ్రిటిలు కరోనాని ఎదుర్కొంటున్నారు..

అయితే, సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. గడిచిన వారంలో తన తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని.. ఇంట్లో అందరూ జాగ్రత్త పడి వెంటనే కోవిడ్ పరిక్షలు చేయినచుకున్నామని.. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి అని తమన్నా తెలిపింది. అయితే, దురదృష్టవశాత్తు తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు చెప్పింది. అంతే కాదు తనతో పాటు ఇతర కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించింది.



S. Srikanth

S. Srikanth

Next Story