Tollywood: ఆడవాళ్లు మీకు జోహార్లు.. రష్మిక మందన క్యూట్ లుక్

Tollywood:టాలీవుడ్ లో వరుస అవకాశలతో దూసుకుపోతుంది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న.

Samba Siva Rao
Published on: 5 April 2021 3:44 PM IST
Adavallu Meeku Joharlu Movie Poster
X

రుష్మిక మందన్న 

Tollywood: టాలీవుడ్ లో వరుస అవకాశలతో దూసుకుపోతుంది క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న. యంగ్ హీరో శర్వానంద్‌ ప్రధాన పాత్రలో కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే నేడు (ఏప్రిల్ 5) రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో చీరకట్టి హోమ్లీ లుక్‌తో ఆకర్షిస్తోంది రష్మిక. పసుపు రంగు చీరలో పువ్వులను కడుతున్నట్లు ఉన్న లుక్‌లో రష్మిక చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. మరోవైపు అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో రష్మిక పల్లెటూరు అమ్మాయిగా కనిపించనుందని, చిత్రంలో ఆమె రోల్ చాలా కీలకం అని టాక్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మాస్ లుక్‌లో కనిపించనున్నారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది రష్మిక. తమిళంలో 'సుల్తాన్' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో తొలిసారి నటిస్తోంది. ఇక రష్మిక హిందీలో 'గుడ్ బై' మూవీ చేస్తోంది. దీంతోపాటు తెలుగులో ''పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు'' సినిమాలతో బిజీగా ఉంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story