Actress Pragathi: చీరకట్టుతో ప్రగతి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

Actress Pragathi: ప్రగతి మాస్ స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Samba Siva Rao
Published on: 30 April 2021 2:05 PM IST
Actress Pragathi: Tollywood Actress Pragathi Mass Dance With Saree Video Viral in Social Media
X

ప్రగత్ డాన్స్ 

Actress Pragathi: టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. గత ఏడాది ప్రగతి వ్యాయామం చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేసిన వావ్ అనిపించారు. ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు అప్ లోడ్ చేశారు. దీంతో ప్రగతిలోని టాలెంట్ బయటపడింది. ప్రగతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాల్లలో హీరోయిన్ ‌గా నటించిన విషయం తెలిసిందే.

పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ప్రగతి. గంగోత్రి సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రతో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రగతి పలువురు హీరోలకు తల్లి పాత్రలు చేసింది. ఇటీవలి కాలంలో సినిమాలు కనిపించడం తగ్గించింది. సీరియల్స్ లో నటిస్తూ బీజీగా ఉంటుంది. అయితే ప్రగతి తాజాగా ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ డే సందర్భంగా తన స్నేహితురాలితో కలిసి పాపులర్‌ 'ఫేమ‌స్‌ డ్రీమ‌మ్ వేక‌ప‌మ్' అనే సాంగ్‌కు చిందేసింది. చీరకట్టులో మాస్‌ స్టెప్పులతో ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది. ఈ ఏజ్‌లో కూడా ఫిట్‌గా ఉంటూ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్‌ చేశారంటూ పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గతంలో బొంబాయి చిత్రంలోని 'హమ్మ.. హమ్మ..' పాటకు డ్యాన్స్‌ చేసింది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story