logo
సినిమా

వేధింపులు తట్టుకోలేకపోతున్న: నటి మాధవీలత

వేధింపులు తట్టుకోలేకపోతున్న: నటి మాధవీలత
X
Highlights

*సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ను కలిసిన మాధవీలత *కొన్ని రాజ‌కీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసాయి - మాధవీలత

ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే కొన్ని రాజ‌కీయ పార్టీలు త‌న‌ను టార్గెట్ చేసి సోష‌ల్ మీడియా వేదిక ద్వారా అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో పాటు అస‌త్య ప్రచారాలు చేస్తున్నాయ‌ని సినీ న‌టి మాధ‌వీల‌త అన్నారు. ఈ విష‌యం పై సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ను క‌లిశారు. అనంత‌రం సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసే వారు ద‌మ్ము, ధైర్యం ఉంటే ఆధారాల‌తో త‌న ముందుకు రావాలంటున్నారు మాధ‌వీల‌త.

ఏదైనా కేసులో అమ్మాయిలు పట్టుబడితే అందులో తాను కూడా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేవాలయాల వంటి అంశాలపై మాట్లాడితే వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వాట్సాప్ లలో కొన్ని గ్రూపులు స్క్రీన్ షాట్‌లు చేసి మరి ఫార్వర్డ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణాలపై తాను ఇంతకాలం సోషల్‌మీడియా వేదికగా పోరాటం చేశానని... ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మానసికంగా నన్ను మరింత కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.‌

Web TitleTollywood Actress Madhavi Latha complaint to police for harassment
Next Story