డిగ్రీ అర్హత పరీక్ష రాసిన హేమ!

Hema Write Exam : సపోర్టింగ్ క్యారెక్టర్ హేమ హేమ అందరికి గుర్తుండే ఉంటుంది.. అక్క, వదిన, అత్త ఇలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇంకా మెప్పిస్తునే ఉంది.

Krishna
Published on: 27 Sept 2020 6:23 PM IST
డిగ్రీ అర్హత పరీక్ష రాసిన హేమ!
X

Hema write degree entrance exam 

Hema Write Exam : సపోర్టింగ్ క్యారెక్టర్ హేమ హేమ అందరికి గుర్తుండే ఉంటుంది.. అక్క, వదిన, అత్త ఇలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఇంకా మెప్పిస్తునే ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఆదివారం హేమ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అర్హత పరీక్షకు హాజరైంది. నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజీలో ఆమె ఈ అర్హత పరీక్ష రాశారు. పరీక్ష అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను రామోజీఫిల్మ్‌సిటీలో 'కొండాపురం' సినిమా చిత్రీకరణలో ఉన్నానని అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొండ జిల్లాను సెంటర్ గా ఎంచుకొన్నట్లుగా వెల్లడించింది.

గత రెండేళ్లుగా డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికి వీలు కాలేదని ప్రస్తుతం ఆ అవకాశం దొరికినట్టుగా వెల్లడించింది. డిగ్రీతోపాటు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోనున్నట్లుగా ఆమె వెల్లడించింది. ఇక హేమ గత ఏడాది బిగ్ బాస్ మూడవ సీజన్ లో పాల్గొని మొదటివారంలోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. అనంతరం షో పైన, షో సభ్యుల పైన ఆమె వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలతో బిజీగా ఉంది.


Krishna

Krishna

Next Story