Eesha Rebba: హద్దులు దాటిన నెటిజన్ల వికృత చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బ!

Eesha Rebba: టాలీవుడ్ అందాల నటి ఈషా రెబ్బ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్యకర దాడులపై గట్టిగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 4 Feb 2026 4:47 PM IST
Eesha Rebba: హద్దులు దాటిన నెటిజన్ల వికృత చేష్టలు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బ!
X

Eesha Rebba: టాలీవుడ్ అందాల నటి ఈషా రెబ్బ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్యకర దాడులపై గట్టిగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

సాధారణంగా సెలబ్రిటీలు ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోరు. కానీ, గత కొంతకాలంగా ఈషా రెబ్బ పోస్ట్ చేస్తున్న ఫోటోలపై కొందరు నెటిజన్లు హద్దులు మీరుతూ అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేధింపులు మితిమీరడంతో ఆమె మౌనాన్ని వీడి చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

నటి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అసభ్యకర వ్యాఖ్యలు ఏ అకౌంట్ల నుంచి వచ్చాయి? వాటి వెనుక ఉన్నది ఎవరు? అనే కోణంలో టెక్నికల్ టీమ్ ఆరా తీస్తోంది. సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఈషా రెబ్బ తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. కేవలం ఫేమస్ అవ్వడం కోసమో లేదా పైశాచిక ఆనందం కోసమో ఇలాంటి కామెంట్స్ చేసే వారికి ఈ ఫిర్యాదు ఒక గుణపాఠం కావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసభ్యతకు వ్యతిరేకంగా గొంతు ఎత్తిన ఈషా ధైర్యాన్ని అభినందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story