Tollywood: పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన‌ చార్మి

Tollywood: టాలీవుడ్ చార్మింగ్ గాళ్ చార్మి పెళ్లి చేసుకోబోతోందని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

Samba Siva Rao
Updated on: 9 May 2021 12:27 PM IST
Charmy Kaur
X

ఛార్మి ఫైల్ ఫోటో 

Tollywood: టాలీవుడ్ చార్మింగ్ గాళ్ చార్మి పెళ్లి చేసుకోబోతోందని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. తమ సమీప బంధువుతో కలిసి ఏడు అడగులు నడిచేందుకు సిద్ధమవుతోందని సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. తాజాగా త‌న పెళ్లి వార్త‌ల‌పై చార్మి స్పందించింది. తాను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వాస్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ రూమర్స్‌ అని కొట్టిపడేసింది. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.

ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేసింది. 'ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ జీవితం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను' అని చార్మి ట్వీట్‌ చేసింది. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారికి స్విట్ వార్నింగ్ ఇచ్చింది. 'తప్పుడు క‌థ‌నాల‌తో అట్రాక్ట్ చేస్తున్న మిమ్మల్ని అభినందించవచ్చు' వ్యగ్యంగా ట్వీట్‌ చేసింది చార్మి.

చార్మి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ తో 'లైగర్‌' అనే పాన్‌ ఇండియా సినిమాను నిర్మిస్తుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌. కరణ్‌ జోహార్‌ మరో నిర్మాత. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనక్ట్స్‌ బ్యానర్స్‌ పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది వ‌చ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో వీరిలో జోష్ నిపింన‌ సంగతి తెలిసిందే.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story