Anushka Says No to Web Series: బుల్లితెరకు అనుష్క నో!

Anushka Says No to Web Series: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు.

S. Srikanth
Published on: 1 Aug 2020 2:59 PM IST
Anushka Says No to Web Series: బుల్లితెరకు అనుష్క నో!
X
Anushka Shetty (File Photo)

Anushka Says No to Web Series: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. అనుష చేసిన చిత్రం 'నిశాబ్ధం' త్వరలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రం హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 2న విడుద‌ల‌ కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అనుష్కతో పాటుగా అంజలి, షాలిని పాండే, మాధవన్ కీలక పాత్రలు పోషించారు.. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై స్పష్టత లేదు. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఆసక్తి చూపించింది, కాని మళ్ళీ దాని గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు..ఇంతలో, అమెజాన్ వెబ్ సిరీస్ ప్రతిపాదనతో అనుష్కాను సంప్రదించింది, అయితే అనుష్క ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అనుష్క వెబ్ సిరీస్ కంటే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్, తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది అనుష్క.. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.. ఇలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనుష్క శెట్టి సడన్ గా సినిమాలకి గుడ్ బై చెపుతుంది అనే వార్త అందరికి షాక్ ఇచ్చినట్టు అవుతుంది.


S. Srikanth

S. Srikanth

Next Story