Anjali: టాలెంట్ వుంటే ఛాన్స్ అదే వస్తుంది... అంజలి

Anjali: నీకు టాలెంట్‌ ఉంటే.. అవకావాలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అంటోంది అంజలి

Kranthi
Published on: 5 Jun 2021 7:54 AM IST
Tollywood Actress Anjali Upcoming Movies
X

Actress Anjali:(File Image)

Anjali: నువ్వు ట్యాలెంట్ ను నమ్ముకో.. నిన్ను సినిమా నమ్ముతుంది.. అని ఫార్ములా చెబుతోంది తెలుగింటి అందం అంజలి. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల పక్కన ఛాన్స్ లు కొట్టేసిన అంజలి తర్వాత కొన్ని సమస్యలు రావడంతో స్పీడు తగ్గిపోయింది. ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రైజ్ అయింది. అందులోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషించి అభినందనలు అందుకుంది. తనలో మునుపటి మెరుపు తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. అందుకేనేమో చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతోంది.. ట్యాలెంట్ ఉంటే ఛాన్సులు రాకుండా ఉండవని.

కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సీనియర్లకు ఛాన్స్‌ లు తగ్గుతాయన్న ఫార్ములాను నేను అస్సలు నమ్మనంటున్నారు టాలీవుడ్ సీతమ్మ అంజలి. షాపింగ్ మాల్ ద్వారా పరిచయం అయిన భామ అంజలి, తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించింది. రీసెంట్‌గా వకీల్ సాబ్‌తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ…. అవకాశాలు రావట్లేదన్న వార్తలపై రియాక్ట్ అయ్యారు. న్యూ టాలెంట్‌ వల్లే తనకు ఆఫర్స్ రావటం లేదన్న వార్తలను కూడా కొట్టి పడేశారు. `ఇండస్ట్రీలో ఛాన్స్‌లు రావాలంటే టాలెంట్‌ ఉండాలి… నీకు టాలెంట్‌ ఉంటే.. అవకావాలు అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి` అంటూ వేదాంతం మాట్లాడుతున్నారు.

మిగతా హీరోయిన్స్‌ చేస్తున్న క్యారెక్టర్స్ నాకొస్తే బాగుండనుకోవటం కూడా కరెక్ట్‌ కాదంటున్నారు అంజలి. అది కంప్లీట్‌గా మేకర్స్ ఛాయిస్‌.. వాళ్లు క్యారెక్టర్‌కు ఎవరు కరెక్ట్‌ అనుకుంటే వాళ్లనే పిక్ చేసుకుంటారన్నారు. కెరీర్‌లో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లతో పాటు నివేదా లాంటి యంగ్ జనరేషన్ హీరోయిన్లతోనూ కలిసి నటించిన అంజలి.. వాళ్లలో ఎవరినీ తనకు పోటి అనుకోలేదంటున్నారు. అంతేకాదు.. సీనియర్ అయినా.. జూనియర్‌ అయినా.,.. కో ఆర్టిస్ట్‌ నుంచి ఎంతో కొంత నేర్చుకునే ఛాన్స్ అయితే ఉందన్నారు.

Kranthi

Kranthi

Next Story