ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ నిర్ణయం..

ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ నిర్ణయం..
x
Highlights

నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబసభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి...

నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబసభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కుదరడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌కు నివాళులర్పించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు రావడం లేదని నిర్మాత, ఎన్టీఆర్ కు పీఆర్వోగా వ్యవహరిస్తున్న మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories