KTR Birthday: కేటీఆర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ స్పెషల్ విషెస్

Arun Chilukuri
Published on: 24 July 2020 3:35 PM IST
KTR Birthday: కేటీఆర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ స్పెషల్ విషెస్
X

Prakash Raj Wishes on KTR Birthday: తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. నటుడు ప్రకాష్ రాజ్..డియర్ ఫ్రెండ్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు మరింత ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రకాశ్‌ రాజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. విపత్తు వచ్చినప్పుడు ప్రజల కోసం నిలబడేవాడే నిజమైన నాయకుడు అని అందులో పేర్కొన్నారు. తెలంగాణలో ఆ బాధ్యతను కేటీఆర్‌ సమర్థంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

కేటీఆర్‌ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. శ్రామికులను దేశాభివృద్ధి భాగస్వాములుగా భావిస్తూ వారి కష్టాలను తీర్చుతూ కేటీఆర్‌ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన వీడియోలో ఉంది. ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించిన కార్యక్రమాలకి సంబంధించిన దృశ్యాలను ప్రకాశ్‌ రాజ్ చూపించారు. ప్రజలకు కేటీఆర్‌ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పారు. నాయకుడంటే ఎలా ఉండాలో కేటీఆర్‌ నిరూపిస్తున్నారని ప్రశంసించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story