ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్‌ కన్నుమూత
x
Highlights

ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన నర్సింగ్‌ యాదవ్ చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ...

ప్రముఖ సినీనటుడు నర్సింగ్ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన నర్సింగ్‌ యాదవ్ చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. సుమారు 300పైగా సినిమాల్లో నర్సింగ్ యాదవ్ నటించారు. నర్సింగ్‌ యాదవ్‌ 1968 జనవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. హేమాహేమీలు' చిత్రంలో నర్సింగ్ సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం నటుడిగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆయనకు బ్రేక్‌ ఇచ్చారు. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన 'క్షణక్షణం'లో నర్సింగ్‌ నటించారు. అనంతరం మాయలోడు, అల్లరిప్రేమికుడు, ముఠామేస్త్రి, మాస్టర్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఇడియట్‌, గాయం, పోకిరి, యమదొంగ, అన్నవరం, జానీ, ఠాగూర్‌, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ తదితర చిత్రాల్లో ఆయన కీలక పాత్రల్లో మెప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories