సీఎం జగన్‌తో మంచు విష్ణు లంచ్..

Samba Siva Rao
Published on: 29 Jan 2021 8:40 PM IST
సీఎం జగన్‌తో మంచు విష్ణు లంచ్..
X

మంచు విష్ణు 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతిని శుక్రవారం తాడేపల్లిలో మంచు విష్ణు దంపతులు కలిశారు. మధ్యాహ్న భోజనం చేయడంతోపాటు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం జగన్‌తో సెల్ఫీ దిగిన విష్ణు ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

కాగా.. మంచు విష్ణు ప్రస్తుతం 'మోసగాళ్లు' సినిమాలో చేస్తున్నాడు. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించగా.. విష్లునే నిర్మిస్తున్నారు. విష్ణు జోడీగా రుహీ సింగ్‌, అతడి సోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న 'ఢీ' చిత్రానికి సీక్వెల్‌ 'డి-డి(డబుల్‌ డోస్‌)'లోనూ కనిపించనున్నాడు. ఈ సినిమాకు గోపీమోహన్‌, కిషోర్‌ రచయితలు పని చేస్తున్నారు.

'జగన్ అన్న, భారతి అక్కను కలిశాం. లంచ్ చేశాం. విద్య పట్ల ఆయనకున్న విజన్ మరోస్థాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆయనలోని హాస్య కోణాన్ని ప్రజలు మరింత తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అని మంచు విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు


Samba Siva Rao

Samba Siva Rao

Next Story