'సర్కార్ వారి పాట' .. అంటున్న మహేష్.. ఇందులో నిజం ఎంత?

సర్కార్ వారి పాట .. అంటున్న మహేష్.. ఇందులో నిజం ఎంత?
x
Mahesh Babu, Parasuram (File Photo)
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మొదటి సారి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. మొదటి సరి పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ అంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా ' గీతా గోవిందం' చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా మహేష్ బాబుతో చేసే సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వల్ల మార్చ్ నెలలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దాని వల్ల చాలా చిత్రాలు నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.. కొన్ని థియేటర్లు మూసివేయటం కారణంగా రిలీజ్ నోచుకోలేదు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ముగియ గానే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ను బట్టి చూస్తుంటే మహేష్ సినిమా రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలిసిందే.

మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను చెప్పనున్నది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకై కియారా అద్వానీ ని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ తో కలిసి నటించింది. ఇప్పుడు సినిమా కోసం మరో హీరోయిన్‌ను కూడా వెతికే పనిలో పడింది మూవీ యూనిట్.

Show Full Article
Print Article
Next Story
More Stories