Kartikeya: ప్రేయసి లోహితతో ఘనంగా నటుడు కార్తికేయ వివాహం

* స్నేహితులుగా మొదలైన కథ జీవిత భాగస్వామిగా వచ్చేవరకు కొనసాగింది.

Shilpa
Published on: 21 Nov 2021 3:59 PM IST
Tollywood Actor Kartikeya Marriage with his Lover Lohitha Today 21 11 2021
X

ప్రేయసి లోహితతో ఘనంగా నటుడు కార్తికేయ వివాహం(ఫైల్ ఫోటో) 

Kartikeya Marriage: టాలీవుడ్ నటుడు కార్తికేయ తన ప్రియురాలు లోహితతో వివాహం ఘనంగా జరిగింది. స్నేహితులుగా మొదలైన కథ.. జీవిత భాగస్వామిగా వచ్చేవరకు కొనసాగింది. NIT వరంగల్ లో బిటెక్ చదువుతున్న రోజుల్లో లోహితతో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలోనే సినిమాల్లో రాణించాలని కార్తికేయ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

తన మొదటి సినిమా ''ఆర్ఎక్స్100''తో మంచి మార్కులు కొట్టేసారు. అయన నటించిన ''రాజా విక్రమార్క'' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంది. అజిత్ హీరోగా నటించిన ''వలిమై'' సినిమా లో కార్తికేయ కీలక పాత్ర పోషించారు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

హాజరైన సినీ ప్రముఖులు(ట్విట్టర్ ఫోటో)


ప్రియురాలు లోహిత కార్తి​కేయ కుటుంబానికి దగ్గరి బంధువు. ఈ రోజు(నవంబర్ 21) హైదరాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో తన ప్రేయసితో కార్తికేయ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Shilpa

Shilpa

Next Story