Ali Tweet on Pawan Kalyan: పవన్ కు అలీ ట్వీట్.. అభిమానుల రెస్పాన్స్

Ali Tweet on Pawan Kalyan: పవన్ కల్యాణ్, అలీల మధ్య స్నేహం గురించి చెప్పాలంటే వారిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో లెక్క వేసుకుంటే తెలుస్తుంది.

admin1
Updated on: 16 July 2020 8:49 AM IST
Ali Tweet on Pawan Kalyan: పవన్ కు అలీ ట్వీట్.. అభిమానుల రెస్పాన్స్
X
pawan kalyan and ali (File Photo)

Ali Tweet on Pawan Kalyan: పవన్ కల్యాణ్, అలీల మధ్య స్నేహం గురించి చెప్పాలంటే వారిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో లెక్క వేసుకుంటే తెలుస్తుంది. వపన్ కల్యాణ్ ఏ ఒక్క సినిమా అలీ లేకుండా చేయలేదంటే నమ్మకం కుదరదు. అలాంటి వ్యక్తులిద్దరూ ఇటీవల ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వ్యతిరేకులయ్యారు. అయితే తాజాగా పవన్ పుట్టినరోజుకు సంబంధించి అలీ ఒక ట్వీట్ చేశారు. అయితే దీనికి పవన్ అభిమానుల నుంచి రెస్పాన్స్ బాగా వస్తోంది.

సినిమాల పరంగానూ.. వ్యక్తిగతంగానూ.. పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే గత ఎన్నికల్లో అలీ.. పవన్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. కాగా, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. ఫ్యాన్స్ గత రెండు రోజుల నుంచి #PSPKAdvBdayTrendOnJuly13th అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో కమెడియన్ అలీ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

"వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు, నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు…@Pawankalyan" అంటూ అలీ పవన్‌పై పొగడ్తలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్‌ను ఉద్దేశించి మీరన్న మాటలను మర్చిపోలేం అంటూ అలీపై ఫైర్ అవుతున్నారు.


admin1

admin1

Next Story