నేను సింగిల్‌ పీస్‌ అంటున్న అనసూయ!

టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తరవాత జబర్దస్త్ షోకి యాంకర్ గా మారిపోయింది.

Krishna
Published on: 24 May 2020 6:14 PM IST
నేను సింగిల్‌ పీస్‌ అంటున్న అనసూయ!
X
Anasuya(File photo)

టీవీ యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టిన అనసూయ ఆ తరవాత జబర్దస్త్ షోకి యాంకర్ గా మారిపోయింది.ఇలా టీవీ యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో మంచి పాత్రలు వచ్చినప్పుడు తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని బయటపెట్టింది. అందులో భాగంగానే సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, రంగస్థలం సినిమాలు మంచి పేరును తీసుకువచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ..

ఇక ఇది ఇలా ఉంటే లాక్ డౌన్ సమయం కావడంతో ఇంట్లో సరదాగా గడుపుతూనే తన అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది అనసూయ. గత రెండు నెలలుగా షూటింగ్స్ లేక ఇంటికే పరిమితమైన ఈ భామ.. తన హోమ్ క్వారంటైన్ విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలపై స్పందించింది. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నానని పేర్కొంది అనసూయ. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం అని చెబుతూ.. వీలైనంత త్వరలో ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అనసూయ వెల్లడించింది.

తన భర్తే తనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ బాయ్ ఫ్రెండ్ అని భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్‌ అని పేర్కొంది. మా పదో వార్షికోత్సవాన్ని ఇటలీలో జరుపుకోవాలని ఎన్నో అనుకున్నామని కానీ లాక్ డౌన్ వలన అవేమీ చేయలేకపోతున్నాం అని చెప్పుకొచ్చింది.

ఇక ఓ నెటీజన్ మీలాంటి అమ్మాయి నాకు లవర్‌గా రావాలని దీవించండి అని అడగగా దానికి అనసూయ స్పందిస్తూ.. అది కొంచెం కష్టమని, ఎందుకంటే నేను సింగిల్‌ పీస్‌!! మంచి అమ్మాయి, కొంచెం నాలాంటి అమ్మాయి రావాలని ఆశిస్తున్నానని చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది అనసూయ..

Krishna

Krishna

Next Story