Fun Bucket Bhargav Arrest: మళ్ళీ నోరు జారాడు.. జైలుకి వెళ్ళాడు

* బెయిల్ రూల్స్ ని పాటించకపోవడంతో ఫన్ బకెట్ భార్గవ్ మళ్ళీ అరెస్ట్

Sandeep Reddy
Updated on: 8 Nov 2021 5:18 PM IST
Tiktok Bhargav Arrested Again due to Break the Bail Rules
X

Fun Bucket Bhargav: నువ్వు మారవు.. మళ్ళీ జైలుకు ఫన్ బకెట్ భార్గవ్

Fun Bucket Bhargav Arrest: కొంచెం టాలెంట్ ఉందని ఫేమస్ అయిపోవచ్చని సోషల్ మీడియాని ఒక పద్దతిగా వాడుకుంటే మంచిదే కాని ఫేమస్ అయ్యాము కదా ఆ ముసుగులో ఏది చేసిన ఎవరు ఏమి చేయలేరని అనుకుంటే మాత్రం వెకిలి చేష్టలతో, మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి జైలు ఊచలు లెక్కపెడుతున్న ఫన్ బకెట్ భార్గవ్ కి పట్టిన గతే పడుతుంది. మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబర్చుకున్న టిక్ టాక్ స్టార్ అని చెప్పుకునే భార్గవ్ ని ఏప్రిల్ 18న అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తరువాత కొన్ని కండిషన్స్ తో జూన్ 15న బెయిల్ మంజూర్ చేశారు.

అయితే బయటికి వచ్చిన అతని తీరు మారకపోగా సంబంధిత కేసుపై వ్యాఖ్యలు చేయడంతో పాటు సాక్ష్యులను బెదిరిస్తున్నాడని, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతూ కామెంట్స్ చేయడంతో బెయిల్ రూల్స్ ని ఉల్లంఘించాడని మరోసారి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపారు. ఆ సంబంధిత వీడియోల ఆధారంగా బెయిల్ రద్దు చేయాలని దిశ ఎసిపి ప్రేమ్ కాజల్ పోక్సో కోర్టులో మెమో ఫైల్ చేశారు.

యూట్యూబ్ లో అనవసరమైన వీడియోస్ పెడుతూ వాటికి వచ్చిన కామెంట్స్ పై ఘాటుగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. చేసిందే చెత్త పని మళ్ళీ దానికి సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేయడం వద్దురా బాబు ఇకనైనా మారు అనే వారిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడంతో ఈ వికృత చేష్టలు చేసే వ్యక్తి జనాల మధ్య ఉండటం ప్రమాదమేనని తిరిగి జైలుకే పంపారు పోలీసులు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story