వచ్చే దసరాకి బిగ్ ఫైట్ : ఏకంగా మూడు భారీ సినిమాలు రిలీజ్?

వచ్చే దసరాకి బిగ్ ఫైట్ : ఏకంగా మూడు భారీ సినిమాలు రిలీజ్?
x
Highlights

ఈ ఏడాది (2020) జనవరి తప్ప మిగిలిన నెలలలో సినిమా ఇండస్ట్రీ బాగానే నష్టపోయిందని చెప్పాలి. లాక్ డౌన్ వలన ధియెటర్లు మూతపడడంతో తమ సినిమాలు విడుదల చేయలేకపోయారు దర్శకనిర్మాతలు.

ఈ ఏడాది (2020) జనవరి తప్ప మిగిలిన నెలలలో సినిమా ఇండస్ట్రీ బాగానే నష్టపోయిందని చెప్పాలి. లాక్ డౌన్ వలన ధియెటర్లు మూతపడడంతో తమ సినిమాలు విడుదల చేయలేకపోయారు దర్శకనిర్మాతలు. కొందరు తమ సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తే, మరికొంత తమ మంది సినిమాలను పక్కాగా ధియేటర్లలలోనే రిలీజ్ చేయాలనీ వాయిదా వేశారు. ప్రస్తుతం ధియేటర్ల రీఓపెన్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమాలను ధియేటర్లలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ మాత్రం ముందుకు రావడం లేదు. చూస్తుంటే వచ్చే ఏడాది (2021) సంక్రాంతికే కొత్త కొత్త సినిమాలతో మళ్ళీ ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి(2021)కి రెడ్, క్రాక్, రంగ్ దే, అరణ్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు వస్తాయని ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాల విడుదలను బట్టి మెగాస్టార్ ఆచార్య, రాజమౌళి త్రిబుల్ ఆర్, వెంకటేష్ నారప్ప చిత్రాలు వచ్చే ఏడాది సమ్మర్ (2021)లో రిలీజ్ అవుతాయి. అయితే దసరాకి మాత్రం బిగ్ ఫైట్ నడవనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది దసరా(2021)కి ఏకంగా మూడు భారీ సినిమాలు పోటీ పడుతున్నాయని తెలుస్తోంది. అవే మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్, అల్లు అర్జున్ పుష్ప

ఇవన్ని అనుకున్న సమయానికి షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటేనే దసరా బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రభాస్ రాధే శ్యామ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. అటు పుష్ప కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మహేష్ కూడా తాజాగా సర్కారు వారి పాట సినిమాని మొదలు పెట్టేశాడు. ఆరు నెలల్లోనే సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అన్నీ ఒకేసారి వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర రచ్చ తప్పేలా లేదు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories