Tollywood: ఆగస్టులో క్లాష్ అవుతున్న మూడు సినిమాలు

Tollywood: ఆగస్టులో క్లాష్ అవుతున్న మూడు సినిమాలు

Rama Rao
Updated on: 20 Jun 2022 1:30 PM IST
Three Movies Clashing in August | Tollywood News
X

Tollywood: ఆగస్టులో క్లాష్ అవుతున్న మూడు సినిమాలు

Tollywood: గత కొంత కాలంగా ఒకదాని తర్వాత మరొకటి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టులో విడుదల కాబోతున్న మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులో మొదటిది విక్రమ్ హీరోగా నటిస్తున్న "కోబ్రా" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "కే జి ఎఫ్" ఫేమ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కాబోతుంది.

ఇక యువ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న "మాచర్ల నియోజకవర్గం" సినిమా కూడా ఆగస్టు 12న విడుదల కాబోతోంది. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి మరియు క్యాథరీన్ తెరెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా "గాడ్ ఫాదర్" పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన "లుసిఫర్" కి రీమేక్ గా తెరకెక్కనుంది. సల్మాన్ ఖాన్, నయనతార మరియు సత్యదేవ్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కూడా ఆగస్టు 12న విడుదలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story