Pawan Kalyan: ముగ్గురు ముద్దుగుమ్మలతో పవన్

Pawan Kalyan: "వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Arun Chilukuri
Updated on: 18 April 2022 6:01 PM IST
Three Heroines in Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie
X

Pawan Kalyan: ముగ్గురు ముద్దుగుమ్మలతో పవన్

Pawan Kalyan: "వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్' సింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కథనం ఒకటి వైరల్ గామారింది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసారు. మరో ఇద్దరి భామల కోసం హరీష్ అన్వేషణ చేస్తున్నట్లు సమాచారం. ఓ హీరోయిన్ పాత్ర‌.. చాలా గ్లామ‌రెస్‌గా ఉండాల‌ట‌. ఆ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ కూడా చేయిస్తార‌ని స‌మాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story