Nayanthara - Sathyadev: సత్యదేవ్ సరసన నటిస్తున్న స్టార్ హీరోయిన్

Thimmarusu Movie Hero Sathyadev Playing Husband Character to Nayanthara in Malayalam Movie Remake
x

సత్యదేవ్ - నయనతార (ఫైల్ ఫోటో)

Highlights

Nayanthara - Sathya Dev: కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్"...

Nayanthara - Sathya Dev: కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకుడు మోహన్ రాజాతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలు స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనుందని తెలుస్తోంది. మలయాళం వెర్షన్లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర ఇప్పుడు తెలుగులో యువహీరో సత్యదేవ్ పోషించనున్నారు. కాబట్టి నయనతార ఈ సినిమాలో సత్యదేవ్ భార్య గా కనిపించబోతున్నారు. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఈ సత్యం అవినీతికి పాల్పడటం పాల్పడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో సత్యదేవ్ మరియు నయనతారల మధ్య వచ్చే ఈ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories