ఇండస్ట్రీని కుదిపేస్తున్న రెండు పుకార్లు

*అభిమానులను షాక్కు గురి చేస్తున్న రెండు పుకార్లు

Rama Rao
Updated on: 25 May 2022 5:30 PM IST
These Two Rumours Are Shaking Telugu Movie Industry  | Tollywood News
X

ఇండస్ట్రీని కుదిపేస్తున్న రెండు పుకార్లు

Tollywood: ఈ మధ్యకాలంలో సినిమా ఓకే అవగానే దానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడుతూనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు డీల్ ఇంకా ఫైనలైజ్ కాకుండానే ఫలానా హీరో ఫలానా డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని పుకార్లు బయటకు వచ్చేస్తుంటాయి. అలానే ఇప్పుడు బయటకు వచ్చిన రెండు వార్తలు మొత్తం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అందరూ స్టార్ హీరోలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా "సలార్", మరియు ఎన్టీఆర్ తో మరొక సినిమా ని లైన్ లో పెట్టారు.తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ తాజాగా న్యాచురల్ స్టార్ నాని ని కూడా కలిసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తన తదుపరి సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నానిను కలిసినట్లు తెలుస్తోంది.

మరోవైపు "బొమ్మరిల్లు" సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందించిన బొమ్మరిల్లు భాస్కర్ చాలాకాలం తరువాత మళ్ళీ అక్కినేని అఖిల్ హీరోగా "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటిదాకా డిజాస్టర్ లతో సతమతమైన అఖిల్ కు ఈ సినిమాతో మంచి హిట్ ను అందించారు బొమ్మరిల్లు భాస్కర్. తాజాగా ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ నాగచైతన్య హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్లు ఇంకా జరుగుతున్నాయి. ఈ రెండు కాంబినేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Rama Rao

Rama Rao

Next Story