MAA Elections: 'మా' ఎన్నికల్లో ఓటు వేయని సినీ ప్రముఖులు వీరే!

MAA Elections: "మా" ఎన్నికల పోలింగ్ ముగిసింది.

Arun Chilukuri
Published on: 10 Oct 2021 5:32 PM IST
These Movie Celebrities who did not Vote in MAA Elections
X

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని సినీ ప్రముఖులు వీరే!

MAA Elections: "మా" ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఇక ఆది నుంచి కూడా మా ఎన్నికల పోలింగ్‌ హోరాహోరీగా కొనసాగింది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం పెరిగినట్టు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 883 కాగా 605 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య 52తో కలిపి మొత్తం ఓట్లు 657గా తెలుస్తోంది.

అయితే, పలువురు హీరో-హీరోయిన్లు 'మా' ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. మహేశ్‌బాబు, ప్రభాస్‌, రానా, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌ తదితర హీరోలతో పాటు రకుల్‌, ఇలియానా, త్రిష, హన్సిక తదితరులు ఓటు వేయలేదు. అయితే, వీళ్లందరూ తమ వ్యక్తిగత కారణాలు, వరుస షూటింగ్స్‌తో ఫుల్‌ బిజీగా ఉండటంచేత కొంతమంది నటీనటులు పోలింగ్‌కు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story