'ఆర్ఆర్ఆర్' మూవీని మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్లు వీరే..

These Actresses Rejected RRR Movie
x

‘ఆర్ఆర్ఆర్’ మూవీని మిస్ చేసుకున్న టాప్ హీరోయిన్లు వీరే..

Highlights

RRR Movie: అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన "ఆర్ఆర్ఆర్" సినిమా

RRR Movie: అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించిన "ఆర్ఆర్ఆర్" సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 25న థియేటర్లలో విడుదలైంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అలియా భట్, బ్రిటీష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే వీరికంటే ముందు రాజమౌళి పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట. అయితే వివిధ కారణాల వల్ల వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట.

సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ఆర్ఆర్ఆర్ టీం సంప్రదించగా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్. ఆ తర్వాత పరిణితీ చోప్రాను తీసుకోవాలనుకున్నారు. అయితే ఆమె చేతిలో వరుస సినిమాలు ఉండటంతో.. ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. చివరికి సీత పాత్రలో అలియా భట్ తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందింది.

ఇక ఐ మరియు రోబో 2.0లో నటించిన బ్రిటీష్ నటి అమీ జాక్సన్‌‌కి ముందుగా జెన్నిఫర్ రోల్‌‌ని ఆఫర్ చేశారట రాజమౌళి.. కానీ అప్పుడామె గర్భవతి కావడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. ఇక ఆ పాత్రకి ఆ తరవాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని తీసుకున్నారు రాజమౌళి... కానీ ఆమె కొద్ది రోజులకే RRR ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌‌కు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories