Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్‌ టీమ్‌ క్లారిటీ

Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్‌ టీమ్‌ క్లారిటీ

Jyothi
Published on: 28 May 2023 12:31 PM IST
There were no injuries Hero Sharwanand Team is Clear about the Road Accident
X

Sharwanand: ఎవరికీ గాయాలు కాలేదు.. రోడ్డు ప్రమాదంపై హీరో శర్వానంద్‌ టీమ్‌ క్లారిటీ

Sharwanand: సినీ హీరో శర్వానంద్ కారు ప్రమాదానికి గురయ్యింది. ఫిల్మ్‌నగర్ జంక్షన్ దగ్గర శర్వానంద్ కారు డివైడర్‌ను ఢీకొట్టిన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వానంద్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

హీరో శర్వానంద్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్‌ టీమ్‌ తెలిపింది. ఇది చాలా స్వల్ప ఘటన అని.. కారులోని అందరూ క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేసింది. తొలుత శర్వానంద్‌కు గాయాలైనట్లు ప్రచారం జరగడంతో ఆయన టీమ్‌ క్లారిటీ ఇచ్చింది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. డ్రైవర్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించలేదని తనిఖీల్లో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో శర్వానంద్‌ కారులోనే ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Jyothi

Jyothi

Next Story