Posani Krishna Murali: 2022 ఏడాదికి సంబంధించి ఎంపిక చేశాం.. నంది అవార్డులకు 5 విభాగాల్లో 115 ఎంట్రీలు వచ్చాయి

Posani Krishna Murali: నవంబర్ మొదటివారంలో నంది అవార్డుల ప్రదానం చేస్తాం

Shekhar G
Published on: 19 Sept 2023 4:05 PM IST
There Were 115 Entries In 5 Categories For The Nandi Awards Says Posani Krishna Murali
X

Posani Krishna Murali: 2022 ఏడాదికి సంబంధించి ఎంపిక చేశాం.. నంది అవార్డులకు 5 విభాగాల్లో 115 ఎంట్రీలు వచ్చాయి

Posani Krishna Murali: 2022 ఏడాదికి సంబంధించి 22వ నంది నాటకోత్సవాల్లో 33 నాటకాల ఎంపియ్యాయని ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి వెల్లడించారు. నంది అవార్డులకు 5 విభాగాల్లో 115 ఎంట్రీలు రాగా... ఫైనల్స్‌కు 38 నాటకాలు ఎంపికయ్యాయని చెప్పారాయన... ఫైనల్‌లో ఎంపికైన వారికి 73 అవార్డులు ఇస్తామని చెప్పారు. ఉత్తమ ప్రదర్శనలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ అవార్డులు ఇస్తామని, కళాకారులు, సాంకేతిక విభాగ సిబ్బందికి వ్యక్తిగత అవార్డులు అందజేస్తామని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఎంపికైన పద్య నాటకానికి 50 వేల రూపాయలు, సోషల్ ప్లే విభాగానికి 40 వేల రూపాయల బహుమతి ఇస్తామని చెప్పారాయన... సోషల్ ప్లే లెట్, చిన్నపిల్లల ప్లే లెట్, కళాశాల, యూనివర్శిటీ విభాగంలో ఎంపికైన నాటకానికి 25 వేల చొప్పున బహుమతి అందజేస్తమన్నారు. ఫైనల్ పోటీలు ఎక్కడ, ఎప్పుడు జరుపుతామనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని, నవంబర్ మొదటి వారంలో నంది అవార్డులు ప్రదానం చేస్తామని పోసాని వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story