"ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను," అంటున్న అమలాపాల్

Amala Paul: "అప్పుడు సినిమాలు వదిలేయాలి అనుకున్నాను," అంటున్న అమలాపాల్

Jyothi
Published on: 20 Aug 2022 10:25 AM IST
Then I thought I Should leave films Says Amala Paul
X

"ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను," అంటున్న అమలాపాల్ 

Amala Paul: తమిళంలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్ చాలా కొద్ది కాలంలోనే తెలుగులో కూడా స్టార్ హీరోలతో నటించి కొన్ని బ్లాక్ బస్టర్లు కూడా అందుకుంది. అయితే పెళ్లి తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో తెలుగులో ఆమెకు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. మరోవైపు వ్యక్తిగత జీవితంలో విడాకుల వల్ల వచ్చిన కొన్ని ఒడిదుడుకులు కూడా ఆమె కెరియర్ పై ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయిన అమలాపాల్ తమిళంలో మాత్రం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అమలాపాల్.

"జీవితంలో ఒకానొక సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. నేనే పాత్రల వెనకాల పరిగెడుతున్నాను అనిపించేది. సక్సెస్ కోసం వెంపర్లాడుతున్నట్లుగా అనిపించేది. ఆ సమయంలో నేను చాలా కృంగిపోయాను. ఇండస్ట్రీలో ఎందుకు ఇంకా కొనసాగుతున్నాను అర్థం అయ్యేది కాదు. ఇక సినిమాలకి గుడ్ బై చెప్పేయాలి అనేంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అదే సమయంలో మా నాన్నగారు కూడా చనిపోయారు. కానీ నేను ప్రతి ఒక్కరికి సమాధానం అన్నట్లుగా నిలిచి మళ్లీ విజయం వైపుకి నా జీవితాన్ని తీసుకు వెళ్లాను. ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. నాపై ఇప్పుడు నాకు పూర్తి విశ్వాసం ఉంది. నన్ను నేను ఎప్పుడూ ప్రోత్సహించుకునే తీరు నాకు బాగా నచ్చుతుంది," అని చెప్పుకొచ్చింది అమలాపాల్.

Jyothi

Jyothi

Next Story