కరోనా ఎఫెక్ట్ : కేరళలో థియేటర్ల మూసివేత

కరోనా ఎఫెక్ట్ : కేరళలో థియేటర్ల మూసివేత
x
Kerala movie theatres
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 56కి చేరుకున్నాయి. ఇక తాజాగా కేరళలో తాజాగా 6 కరోనా కేసులు...

కరోనా వైరస్ ఇప్పుడు దేశం మొత్తాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 56కి చేరుకున్నాయి. ఇక తాజాగా కేరళలో తాజాగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపద్యంలో ఈ రోజు (మంగళవారం)మలయాళ సినిమా సంస్థలు ఓ సమావేశాన్ని నిర్వహించి రేపటినుంచి మార్చి 31 వరకు కేరళలోని థియేటర్లను ముసివేస్తునట్టుగా నిర్ణయం తీసుకున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకునట్టుగా వెల్లడించాయి..

ఇక దీనిపైన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. కరోనా ప్రభావం ఇప్పుడు దేశమంతటా ఉన్నందున సినిమా థియేటర్లను, పాఠశాలలను మార్చి 31 వరకు మూసివేయాలని ఆదేశించారు. అంతేకాకుండా బహిరంగ సమావేశాలు, బహిరంగ ఉత్సవాలకు మార్చి 31వరకు దూరంగా ఉండాలని సూచించారు. ఇక భారత్ లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో థియేటర్లను మూసివేయాలని మలయాళీ చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర చిత్ర పరిశ్రమలు అనుసరిస్తాయో లేదో అన్నది చూడాలి.

భారత్‌లోనూ క్రమంగా :

చైనాలో మొదలైన కరోనా వైరస్‌(కొవిడ్‌-19) మెల్లిమెల్లిగా ఇతరదేశాలపై కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. ఇక భారత్‌లోనూ క్రమక్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటకలో మూడు, కేరళలో ఆరు కేసులు నమోదు అయ్యాయి. దీనితో సంఖ్య 56కి చేరుకున్నాయి. వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.

పాజిటివ్ టాక్ .. నో ఆడియన్స్

ఇక ప్రతి శుక్రవారం ప్రేక్షకులతో కిటకిటలాడే థియేటర్స్‌ కూడాకరోనా ఎఫెక్ట్ తో ఎవరు సినిమాను చూసేందుకు రావడం లేదు.. గత శుక్రవారం అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. ఓ పిట్టకథ.. పలాస 1978 మొదలగు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలకి మంచి టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు థియేటర్స్‌ కి రావడం లేదు.. ఈ నేపద్యంలో కొత్త సినిమాలను విడుదల చేయాలంటే దర్శక నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories