The Warriorr Movie: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి రామ్‌ 'ది వారియర్‌'

The Warriorr Movie: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్

Arun Chilukuri
Published on: 31 July 2022 1:35 PM IST
The Warriorr Arrives on Hotstar This August 11
X

The Warriorr Movie: నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి రామ్‌ ‘ది వారియర్‌’

The Warriorr Movie: ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో రామ్ "రెడ్" సినిమాతో అంతగా మెప్పించలేకపోయడు. తాజాగా ఇప్పుడు తమిళ డైరెక్టర్ ఎన్ లింగు స్వామి దర్శకత్వంలో "ది వారియర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో హీరో ఆది పినిశెట్టి మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా అక్షర గౌడ మరియు నదియ ముఖ్య పాత్రలు పోషించారు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా జులై 14 న థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజై నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది వారియర్‌.

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్‌ అధికారికంగా వెల్లడిస్తూ ట్వీట్‌ చేసింది. దీంతో సినీప్రియులు అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారియర్‌ను థియేటర్‌లో చూడటం మిస్‌ అయినవాళ్లు వచ్చే నెల 11 దాకా వెయిట్‌ చేసి ఎంచక్కా ఫోన్‌లోనే వీక్షించేయండి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story