కరోనాపై మన పోరు, తీరు మారాలి.. కాజల్ ట్వీట్

కరోనాపై మన పోరు, తీరు మారాలి..  కాజల్ ట్వీట్
x
Highlights

నిన్న ట్వి్స్టుతో కూడిన ట్వీట్ చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కరోనాపై యుద్ధానికి సిద్ధమని ప్రకటించగా ఇవాళ కొత్త పెళ్లి కూతురు కాజోల్ కూడా కరోనాపై తన కోపాన్ని , ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ అభిమానులతో తన ఫీలింగ్స్ ట్వీట్ల ద్వారా పంచుకుంది.

కరోనా వైరస్ పై సెలబ్రిటీల ట్వీట్ల యుద్ధం మొదలైంది.. నిన్న ట్వి్స్టుతో కూడిన ట్వీట్ చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కరోనాపై యుద్ధానికి సిద్ధమని ప్రకటించగా ఇవాళ కొత్త పెళ్లి కూతురు కాజోల్ కూడా కరోనాపై తన కోపాన్ని , ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ అభిమానులతో తన ఫీలింగ్స్ ట్వీట్ల ద్వారా పంచుకుంది.కరోనాపై మన పోరు తీరు మారాలంటూ కాజల్ కామెంట్ చేసింది.కరోనాపై పోరు సామూహికంగా అందరూ ఒకేసారి చేయాల్సి ఉంటుందని చెప్పింది.

కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన తాను తన పద్ధతులన్నింటినీ మార్చుకుంటానని.. తన జీవితాన్ని పూర్తి సురక్షితంగా ఉంచుకోవడమే తన మొదటి ప్రాధాన్యత అనీ కాజల్ తెలిపింది. కరోనాపై మన పోరాటం పంథా మార్చుకోవాలని ఈ సూచన తాను మొదటే చేసి ఉండాల్సిందని..కానీ బెటర్ లేట్ దేన్ నెవర్ అనీ ఈ టాలీవుడ్ చందమామ అభిప్రాయపడింది.

ఒక చిన్న వైరస్ ప్రపంచం పట్ల తన దృక్పథాన్ని మార్చేసిందని కంటికి కనపడని ఓ శత్రువుతో ప్రపంచం మొత్తం11 నెలలుగా నిరంతర పోరాటం చేయాల్సి రావడం జీవితం పట్ల తన ఆలోచనను మార్చేసిందని కాజల్ తెలిపింది. జీవితం పట్ల ప్రతి ఒక్కరి దృక్పథం మారాలని నిరంతర భయానికి ఫుల్ స్టాప్ పెట్టి.. వైరస్ అంతం దిశగా కొత్త టెక్నిక్ లతో జీవనాన్ని మెరుగు చేసుకోవాలని కాజల్ సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories