"వీర సింహా రెడ్డి" లో ఆ సీన్ మామూలుగా ఉండదట..

* "వీర సింహా రెడ్డి" లో ఆ సీన్ మామూలుగా ఉండదట..

Dhatripriya
Updated on: 3 Jan 2023 7:00 PM IST
The Veera Simha Reddy Team Says That The Interval Scene Is Thrilling
X

ఇంటర్వల్ సీన్ అదిరిపోతుంది అంటున్న "వీర సింహా రెడ్డి" బృందం 

Veera Simha Reddy: "అఖండ" తో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్ర బృందం. ఫ్యాక్షన్ జోనర్ లో సినిమా అంటే బాలయ్య కి కొట్టిన పిండి. అసలు ఇండస్ట్రీ లో ఈ హిట్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన హీరోనే బాలకృష్ణ. కానీ చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో బాలయ్య కనిపించనున్నారు. దీంతో అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇంటర్వెల్ కు ముందు వచ్చే కీలమైన యాక్షన్ ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన ట్విస్టు కూడా రివీల్ చేస్తారట. ఇక సెకండ్ హాఫ్ లో ఎవరూ ఊహించనటు వంటి విధంగా కొన్ని ఎపిసోడ్లు ఉంటాయట.

"చెన్నకేశవరెడ్డి" లో భూమిలో నుంచి సుమోలు లేచే సీన్ లో అభిమానులకు వచ్చినంత హై ఈ సినిమాలో పదిరెట్లు ఎక్కువ ఉంటుందని వినికిడి. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ జనవరి 6న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రతి అప్డేట్ తో సినిమా పై అంచనాలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 12 న థియేటర్ లలో విడుదల కాబోతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story