Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది.

Arun Chilukuri
Updated on: 27 Aug 2021 8:43 PM IST
The Trap Tightening Around the Hero Navdeep in the Drugs Case
X

Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. గతంలో అరెస్ట్‌ అయిన నిందితులను విచారించింది. కెల్విన్‌, పీటర్‌, కమింగా నుండి స్టేట్మెంట్‌ రికార్డు చేసిన ఈడీ అధికారులు హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్‌క్లబ్‌కు పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌క్లబ్‌ మేనేజర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విదేశాల నుంచి డార్క్‌ వెబ్‌ ద్వారా సిటీకి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

అయితే డ్రగ్స్‌ తీసుకుని హవాలా రూపంలో తమకు డబ్బులు చెల్లించినట్లు నిందితులు ఈడీకి చెప్పినట్లు సమాచారం. ఇక డ్రగ్స్‌ అమ్మగా వచ్చిన డబ్బులను మనీల్యాండరింగ్‌ ద్వారానే విదేశాలకు పంపినట్లు విచారణలో తేలిందని తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసులో ముమ్మర దర్యాప్తును చేపట్టిన ఈడీ కెల్విన్‌, పీటర్‌, కమింగా బ్యాంకు డీటెయిల్స్‌, ఆన్‌లైన్‌ లావాదేవీల వివరాలు తెప్పిచుకున్నట్లు తెలుస్తోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story