ఎట్టకేలకు విడుదల తేదీ ప్రకటించిన "ఆది పురుష్" బృందం

* "ఆది పురుష్" సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటే..

Dhatripriya
Published on: 18 Jan 2023 11:21 AM IST
The Team Of Aadi Purush Has Finally Announced The Release Date
X

ఎట్టకేలకు విడుదల తేదీ ప్రకటించిన "ఆది పురుష్" బృందం

Adipurush Release Date: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సానన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిపోయింది.

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఏదో కార్టూన్ లాగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో చిత్ర బృందం పై మండిపడ్డారు. దీంతో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై చిత్ర బృందం రివర్క్ చేయడం మొదలుపెట్టింది. దీంతో సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమా కాస్త వాయిదా పడింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్ర బృందం ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్యాన్ ఇండియా సినిమాగా విభిన్న భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాని సిరీస్ మరియు రెట్రోఫిల్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. "తన్హాజీ" ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు గా నటిస్తున్నారు. సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story