వస్తున్నారు మన గూఢచారులు

The Spies are Coming
x

Tollywood: వస్తున్నారు మన గూఢచారులు

Highlights

Tollywood: మన టాలీవుడ్ హీరోలు స్పై థ్రిల్లర్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Tollywood: మన టాలీవుడ్ హీరోలు స్పై థ్రిల్లర్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గూఢచారులుగా, నిఘా ఏజెంట్లుగా, సెక్యూరిటీ కమాండోలుగా మనకు కిక్ ఇచ్చేందుకు వస్తున్నారు. ఈ వరుసలో అక్కినేని హీరో అఖిల్ మనల్ని ఏంజెట్ టైటిల్ తో పలకరించబోతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ కంప్లీట్ స్పై థ్రిల్లర్ మూవీలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపిస్తుండడంతో ప్రేక్షకులు ఏజెంట్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 28న మన ముందుకు రానుంది. దేశంలోనే అత్యంత పెద్దదైన మాఫియాముఠాను పట్టుకునేందుకు అఖిల్ రా ఆఫీసర్ గా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది వెండితెర మీద చూడాల్సిందే..

గూఢచారి చిత్రం అడవిశేష్ కెరీర్ లో ఒక మైలురాయి. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్నారు. వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం జీ2 గా తెరకెక్కుతోంది. గూఢచారి చిత్రానికి మించి ఈసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే కథతో జీ2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక కార్తికేయ2 తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ సైతం స్పై యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. నందమూరి హీరో కల్యాణ్ రామ్ సైతం గూఢచారిగా కనిపించబోతున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం డెవిల్ టైటిల్ తో తెరకెక్కుతోంది. 1945 కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ గూఢచారిగా కనిపించనున్నాడు.

ఇక మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ సైతం స్పై థ్రిల్లర్ చిత్రాన్ని రెడీ చేసుకుంటున్నాడు. గాంఢీవధారి అర్జున టైటిల్ తో ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పూర్తిగా లండన్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ గా కనిపించనున్నాడు. ఫైనల్ గా హైలెట్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ సైతం స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. అయితే ఇది బాలీవుడ్ లో..హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఇవే కాదు అటు బాలీవుడ్ ఇటు మన టాలీవుడ్ లో మరికొన్ని స్పై థ్రిల్లర్స్ రెడీ ఔతున్నాయి. మొత్తంగా సినీ ఆడియెన్స్ కు ఢిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ అందించేందుకు మన మూవీ మేకర్స్, హీరోలు చాలా కష్టపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories