మరో టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు.. ఎంట్రీ?

Tollywood: *హీరోగా మారుతున్న డి.వి.వి.దానయ్య కుమారుడు

admin1
Updated on: 20 March 2022 4:18 PM IST
The Son of a Star Director Who Will Soon be Introduced as a Hero
X

Tollywood: త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న స్టార్ డైరెక్టర్ తనయుడు

Tollywood: వరుసగా స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తూ తాజాగా ఇప్పుడు "ఆర్ఆర్ఆర్" సినిమాని నిర్మిస్తున్న డి.వి.వి.దానయ్య తనయుడు కళ్యాణ్ అతి త్వరలో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త సినిమాలను తీయడంలో ప్రశాంత్ వర్మ దిట్ట.

తాజాగా కళ్యాణ్ సినిమా కోసం కూడా అలాంటిదే ఒక అద్భుతమైన కథను ఎంచుకున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక నవల లాంటి కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఇక తన మొదటి సినిమా కోసం కళ్యాణ్ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాడట, ఇప్పటికే నటన, డాన్స్ మరియు ఫైట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడట.

కళ్యాణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకోవాలని ఆశిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ సినిమాలో హీరోయిన్ మరియు ఇతర నటీనటుల గురించిన వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉన్నాయి. మరి ఈ స్టార్ కిడ్ ఎంత వరకు తన మొదటి సినిమాతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాల్సిందే.

admin1

admin1

Next Story