త్వరలో మొదలు కాబోతున్న "హరిహర వీరమల్లు" షూటింగ్

* త్వరలో మొదలు కాబోతున్న "హరిహర వీరమల్లు" షూటింగ్

admin1
Updated on: 6 April 2022 8:00 PM IST
Shooting of Hari Hara Veera Mallu Movie Will Start Soon
X

త్వరలో మొదలు కాబోతున్న "హరిహర వీరమల్లు" షూటింగ్

Hari Hara Veera Mallu: ఈ మధ్యనే "వకీల్ సాబ్", "భీమ్లా నాయక్" వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే "హరి హర వీర మల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయింది.

ఇక తాజాగా మిగతా భాగం షూటింగ్ మొదలు పెట్టేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ తన రాజకీయ పనులతో బిజీగా ఉండటం వలన ఈ సినిమా షూటింగ్ తిరిగి పట్టాలు ఎక్కడానికి ఆలస్యం అవుతోంది.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ 8 నుంచి మళ్లీ మొదలుకాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ తన లుక్ తో సిద్ధంగా ఉన్నారు. మరి అనుకున్న తేదీకి సినిమా షూటింగ్ తిరిగి మొదలు అవుతుందో లేదో ఇంకా వేచి చూడాల్సి ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story