Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిపై హత్యాయత్నం.. చావు అంచుల నుంచి ఎలా బయటపడ్డారు?

The Shocking Attempt on Chiranjeevis Life How a Fan Tried to Kill the Superstar
x

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిపై హత్యాయత్నం.. చావు అంచుల నుంచి ఎలా బయటపడ్డారు?

Highlights

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిపై హత్యాయత్నం.. చావు అంచుల నుంచి ఎలా బయటపడ్డారు?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి తన కొడుకుకు చిరంజీవి అనే పేరు పెట్టారు. చిరంజీవి అంటే ఆంజనేయస్వామి పేరు. దీనికి మరణం లేనివాడు అని అర్థం. నిన్న చిరంజీవి పుట్టినరోజు. అభిమానులంతా ఎంతో ఉత్సాహంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవిపై ఒక హత్యాయత్నం జరిగింది. ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడడం నిజంగా ఒక అద్భుతమే. 1979 నుంచే చిరంజీవి ఒక స్టార్‌గా ఎదగడం ప్రారంభించారు. 80వ దశకంలో ప్రతి సంవత్సరం 15-16 సినిమాల్లో నటించేవారు. చాలా తక్కువ సమయంలోనే ఆయన తెలుగు సినీ పరిశ్రమలో కొత్త స్టార్‌గా ఎదిగారు. 80వ దశకం చివరి నాటికి చిరంజీవి సూపర్‌స్టార్‌గా మారిపోయారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పల్లెపల్లెనా ఆయన అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి.

చిరంజీవి కూడా తన అభిమానులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఒకసారి 1988లో మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు పరిచయమున్న ఒక అభిమాని షూటింగ్‌కు వచ్చాడు. "ఈ రోజు నా పుట్టినరోజు మీతో కలిసి కేక్ కట్ చేయడానికి వచ్చాను" అని చెప్పాడు. చిరంజీవి కూడా ఆ అభిమానితో కలిసి కేక్ కట్ చేశారు. ఆ అభిమాని ఆ కేక్‌ను చిరంజీవికి తినిపించడానికి ప్రయత్నించాడు. కానీ, బయట ఆహారం తినని చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు. అయినా కూడా ఆ అభిమాని బలవంతంగా కేక్‌ను చిరంజీవి నోటిలో పెట్టడానికి ప్రయత్నించాడు.

ఆ అభిమాని బలవంతం చూసిన యూనిట్ సభ్యులు అతన్ని అడ్డుకున్నారు. వెంటనే ఆ అభిమాని అక్కడి నుంచి పారిపోయాడు. చిరంజీవికి ఏదో అనుమానం వచ్చి నోరు కడుక్కుని, బ్రష్ చేసుకుని షూటింగ్‌కు సిద్ధమయ్యారు. అయితే, మేకప్ వేసుకునేటప్పుడు చిరంజీవి పెదాలు మంటగా అనిపించాయి. ఆయన పెదాలు నీలం రంగులోకి మారడం మొదలైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మరో పెద్ద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిరంజీవికి ఐసీయూలో చికిత్స అందించారు. ఆ సమయంలో ఈ వార్త సెన్సేషనల్ అయింది.

ఆ తర్వాత చిరంజీవి అప్పటి మేనేజర్ ఆ యువకుడిని ఏదో చేసి కనుగొన్నారు. "ఎందుకు ఇలా చేశావు?" అని అడిగినప్పుడు, ఆ అభిమాని "ఇటీవల చిరంజీవి నాతో సరిగా మాట్లాడడం లేదు, ఆయనకు చాలామంది అభిమానులు అయ్యారు. నాకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. నాతో పాటు ఇంకెవరూ ఆయనకు సన్నిహితంగా ఉండకూడదు. అందుకే కేరళకు వెళ్లి అక్కడ మాంత్రికుడితో మంత్రాలు చేయించి విషాన్ని కేక్‌లో కలిపి ఆయనకు తినిపించాను" అని చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories