The Secret Behind Chiranjeevi’s Viral Hook Step: కొరియోగ్రాఫర్లకు సాధ్యం కానిది మెగాస్టార్ ఎలా చేశారంటే?

The Secret Behind Chiranjeevi’s Viral Hook Step: కొరియోగ్రాఫర్లకు సాధ్యం కానిది మెగాస్టార్ ఎలా చేశారంటే?
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో హుక్ స్టెప్ వెనుక ఉన్న ఆసక్తికర రహస్యం. కొరియోగ్రాఫర్లకు దొరకని ఐడియాను చిరు ఎలా ఇచ్చారో ఇక్కడ తెలుసుకోండి.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో చూపిస్తూ ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌గా మారింది. 70 ఏళ్ల వయసులో కూడా చిరు వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమా హైప్‌ను అమాంతం పెంచేసిన ఆ 'హుక్ స్టెప్' వెనుక ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది.

సెట్లో తలలు పట్టుకున్న కొరియోగ్రాఫర్లు!

ఈ సినిమాలోని ప్రధాన సాంగ్ కోసం 'ఆట' సందీప్ నేతృత్వంలోని కొరియోగ్రఫీ టీమ్ హుక్ స్టెప్‌ను సిద్ధం చేసింది. అయితే, ఆ మెయిన్ స్టెప్‌కు ముందు వచ్చే 'లీడ్ మూమెంట్స్' (Lead Moments) ఎలా ఉండాలో ఎవరికీ పాలుపోలేదట. ఎన్ని రకాల మూమెంట్స్ ట్రై చేసినా.. చిరు ఇమేజ్‌కు సరిపడా కిక్ రావడం లేదని టీమ్ మొత్తం డైలమాలో పడిందట.

రంగంలోకి దిగిన బాస్.. సింగిల్ టేక్‌లో ఫినిష్!

తమ టీమ్ ఇబ్బంది పడుతుండటం గమనించిన చిరంజీవి, నేరుగా వారి దగ్గరికి వెళ్లి.. "ఇలా చేస్తే ఎలా ఉంటుంది?" అని కొన్ని మూమెంట్స్ చేసి చూపించారట. అవి చూసి దర్శకుడు అనిల్ రావిపూడి, కొరియోగ్రాఫర్ సందీప్ ఫిదా అయిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చిరు ఆ స్టెప్స్ కోసం ఎలాంటి రిహార్సల్స్ చేయలేదట. అప్పటికప్పుడు తన మనసుకు తోచినట్లుగా గ్రేస్‌ఫుల్‌గా బాడీని షేక్ చేస్తే.. అది కాస్తా సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

దీనిపై చిరు స్పందిస్తూ.. "ఆ మూమెంట్స్ అప్పటికప్పుడు అలా వచ్చేశాయి. ఒక్క టేక్‌లోనే దర్శకుడు ఓకే చేసేశారు" అని వెంకటేష్, అనిల్ రావిపూడిలతో జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories