Meena Husband Dead: మీనా భర్త మృతికి.. పావురాల వ్యర్థాలే కారణమా..?

*లివర్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనా భర్త

Rama Rao
Updated on: 29 Jun 2022 12:55 PM IST
The Reason Behind Meenas Husbands Death | Tollywood News
X

Meena Husband Dead: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?

Meena Husband Dead: ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు.

మీనా ఇంటికి అతి చేరువలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌కు శ్వాస కోశ సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. కొంతకాలంగా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి.

ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం కావడంతో చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని నిర్ణయించినప్పటికీ కుదరలేదు. అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో గత రాత్రి కన్నుమూశారు. విద్యాసాగర్ మరణవార్త తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరగనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story