Prabhas: ప్రభాస్ విదేశాలకు వెళ్ళింది సినిమా షూటింగ్ కోసం కాదా?

The Real Reason Behind Prabhas Going Abroad
x

Prabhas: ప్రభాస్ విదేశాలకు వెళ్లడం వెనుక అసలు కారణం

Highlights

Prabhas: ప్రభాస్ విదేశాలు వెళ్ళింది సినిమా షూటింగ్ కోసం కాదా?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాల విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే "ఆది పురుష్" సినిమా షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా సినిమా మాత్రం విడుదల కి నోచుకోలేదు. ఎప్పటికప్పుడు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు ప్రభాస్ "కే జి ఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేసిన సంగతి తెలిసిందే.

"సలార్" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. ప్రభాస్ విదేశాలకు వెళ్లారని అది ఈ సినిమా షూటింగ్ కోసమేనని కొందరు చెబుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ విదేశాలకు వెళ్ళింది ఈ సినిమా షూటింగ్ కోసం కాదని తెలుస్తోంది. అసలు ప్రభాస్ విదేశాలకు వెళ్ళింది ఏ సినిమా షూటింగ్ కోసం కాదట కేవలం హెల్త్ చెకప్ కోసం మాత్రమే అని తెలుస్తోంది.

అలా అని ప్రభాస్ ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లారని తెలుస్తోంది. ఇక విదేశాల నుంచి మళ్లీ తిరిగి వచ్చాక ప్రభాస్ తన సినిమా షూటింగులతో బిజీ కాబోతున్నారు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాక ప్రభాస్ సందీప్ వంగ దర్శకత్వంలో "స్పిరిట్" నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్టు కే", సినిమాల లో కూడా చేస్తున్నారు. అంతేకాకుండా మారుతీ దర్శకత్వంలో "రాజా డీలక్స్" సినిమా షూటింగ్ కూడా కొంత పూర్తి చేసేసారు ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories