Prabhas: ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన "ప్రాజెక్ట్ కే" అప్డేట్

The Project K Update Left Prabhas Fans Deeply Disappointed
x

Prabhas: ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన "ప్రాజెక్ట్ కే" అప్డేట్

Highlights

Prabhas: ప్రాజెక్ట్ కే దర్శక నిర్మాతలను నిలదీస్తున్న ప్రభాస్ అభిమానులు

Prabhas: లెజెండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన "మహానటి" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "ప్రాజెక్ట్ కే" అనే ఆసక్తికరమైన టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కి సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్ప్రైజ్ అప్డేట్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల అయ్యింది. కానీ ప్రభాస్ అభిమానులని మాత్రం అది నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు.

చిత్ర బృందం సినిమాకి సంబంధించి ఒక వీడియోని విడుదల చేసింది. "మా ప్రపంచం లోకి చూడండి ఫ్రమ్ స్క్రాచ్ ఎపిసోడ్ 1: రీ ఇన్వెంటింగ్ ది వీల్" అంటూ చిత్ర బృందం వీడియోని విడుదల చేసింది. వీడియో అంతా సినిమా కథకి కీలకమైన ఒక టైర్ ను చిత్ర బృందం ఎలా సృష్టించింది అనే దాన్ని చుట్టూ తిరుగుతుంది. కానీ అందులో ప్రభాస్ కాని కనీసం సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ కానీ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అసలు ఏమీ లేని ఆ వీడియోని విడుదల చేయాల్సిన అవసరం ఏముందని కొందరు అభిమానులు చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్ ల పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది.

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories