నాని సినిమా కోసం నిర్మాత అంత ఖర్చు పెట్టాడేంటి?

*నాని సినిమా కోసం నిర్మాత అంత ఖర్చు పెట్టాడేంటి?

Rama Rao
Updated on: 20 July 2022 2:00 PM IST
The Producer is Spending Heavily for Nani Film
X

నాని సినిమా కోసం నిర్మాత అంత ఖర్చు పెట్టాడేంటి?

Nani Movie Budget: నాచురల్ స్టార్ అనే బిరుదు పొంది ఎప్పటికప్పుడు వరుస సినిమాల తో ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నాడు నాని. ఇటీవలే ఆయన నటించిన అంటే సుందరానికి అనే సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాలో నాని నటన కి మంచి పేరొచ్చింది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డీలా పడిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పుడు నాని ఒక రఫ్ అండ్ టఫ్ పాత్రలో కనిపించనున్నాడు.

దసరా అనే టైటిల్ తో త్వరలో రానున్న ఈ సినిమా లో నాని ఒక మాస్ పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.నాని మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతుంది కానీ మధ్య మధ్య పరాజయాలు రావడం తో నిర్మాతలు అతని సినిమాలకి ఆచి తూచి ఖర్చు చేస్తున్నారు. అయితే దసరా అనే ఒక మాస్ సినిమా కి ఏక్కువ ఖర్చు పెట్టి ఇరకాటం లో పడటం కరెక్ట్ కాదు అని ఇప్పటికే నిర్మాతలు భావించారు అనే విషయం బయటకు వచ్చింది. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది.

సినిమా కి బెస్ట్ అవుట్పుట్ తేవడం కోసం ఖర్చుకి వెనకాడకూడదు అని నిర్మాతలు భావించారట. అయితే ఈ సినిమా కోసం దాదాపుగా ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ప్రత్యేకమైన సెట్ ని రూపొందించారట. ఈ సెట్ నాని కెరీర్ మొత్తం లోనే ఎక్కువ విలువ చేసే సెట్ అని తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా నాని సినిమా కోసం సెట్స్ వేశారు కానీ ఇంత రేంజ్ లో ఎప్పుడూ వేయలేదు అని ఫిలిం నగర్ లో అందరూ చెప్పుకుంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story