నాగార్జునతో సినిమా పై ఆసక్తి చూపించని నిర్మాత

Nagarjuna: నాగార్జునకి రైట్స్ ఇవ్వను అంటున్న ప్రముఖ నిర్మాత

Jyothi
Updated on: 10 March 2023 7:30 PM IST
The Producer did not Show interest in the film with Nagarjuna
X

నాగార్జునతో సినిమా పై ఆసక్తి చూపించని నిర్మాత

Nagarjuna: "నేను లోకల్" మరియు "ధమాకా" వంటి సూపర్ హిట్ సినిమాలకి కథను అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగానే అనిపిస్తోంది. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాలకు కథను అందిస్తున్న ప్రసన్న త్వరలోనే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు అని, ఈ సినిమాతో డైరెక్టర్ గా కూడా తన ప్రతిభను చాటనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ మధ్యనే ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. అందులో తమ వద్ద "పురింజు మరియం జోస్" అనే ఒక మలయాళం సినిమా రైట్స్ ఉన్నాయని దానిని త్వరలోనే తెలుగులో రీమేక్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం నాగార్జున కూడా ఈ సినిమాని రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. కానీ అభిషేక్ అగర్వాల్ దగ్గర ఈ చిత్ర రైట్స్ ఉన్నాయి.

ఈ సినిమాని నాగార్జున తో చేయడానికి అభిషేక్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. నాగార్జున ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ తో సినిమా చేయాల్సింది కానీ ఆఖరి నిమిషంలో ప్రసన్న ని రంగంలోకి దింపి ఆయనకే దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. దీంతో అభిషేక్ అగర్వాల్ హర్ట్ అయినట్లు అందుకే నాగార్జునకి ఈ సినిమా రైట్స్ ఇవ్వడానికి ససేమెరా ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే మరోవైపు అలాంటి మాస్ సినిమాలు నాగార్జునకి అంతగా సెట్ అవ్వవు అని, ఆ చిత్రాన్ని నాగార్జున తెలుగులో రీమేక్ చేయకపోవటమే బెటర్ ఏమో అని అభిమానులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story