మిగతా రెండు పాటలు డైరెక్ట్ గా థియేటర్లలోనే అంటున్న "రాధేశ్యామ్" టెక్నీషియన్

"రాధేశ్యామ్" లోని రెండు పాటలు డైరెక్ట్ గా థియేటర్లోనే చూడాలి అంటున్న లిరిసిస్ట్

admin1
Updated on: 10 Jan 2022 8:01 PM IST
The Other Two Songs From the Radhe Shyam Movie Should be Seen Live in Theaters
X

మిగతా రెండు పాటలు డైరెక్ట్ గా థియేటర్లలోనే అంటున్న "రాధేశ్యామ్" టెక్నీషియన్

Radhe Shyam Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న "రాధే శ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల ఈమధ్యనే వాయిదా పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజా సమాచారం అందులో "ఈ రాతలే" పాట కూడా చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటకు లిరిక్స్ ను అందించిన ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి అని అందులో ఇప్పటికి మూడు పాటలు విడుదలయ్యాయి అని చెప్పిన కృష్ణకాంత్ మిగతా రెండు పాటలు మాత్రం డైరెక్ట్ గా సినిమాలోనే ప్రేక్షకులు చూస్తారు అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అవి కథను చెప్పే విధంగా ఉంటాయని అందుకే సినిమా విడుదలకు ముందు ఈ రెండు పాటలను విడుదల చేయకుండా డైరెక్ట్ గా సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఈ పాటలను వింటారని అన్నారు. మరి ఈ రెండు పాటలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తాయో వేచి చూడాల్సిందే.

admin1

admin1

Next Story