Sudigali Sudheer: త్వరలో సుధీర్ పెళ్లి.. కృష్ణా జిల్లా అమ్మాయితో ఫిక్స్..!?

*సుడిగాలి సుధీర్ ..తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.

Sandeep Reddy
Updated on: 7 Nov 2021 1:46 PM IST
The News in The Social Media is Comedian Sudigali Sudheer Will Marry Soon From Krishna District Girl
X

 త్వరలో సుధీర్ పెళ్లి.. కృష్ణా జిల్లా అమ్మాయితో ఫిక్స్..!?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ..తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ వంటి కామెడీ షోతో పాటు యాంకర్ గా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తన కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఈ పెళ్లి సంబంధం కుదిరినట్లు సమాచారం. విజయవాడకి చెందిన సుధీర్ కృష్ణ జిల్లాకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఆన్ స్కీన్ పై యాంకర్ రష్మితో ప్రేమాయణం నడిపించే సుధీర్ అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అని అతడి సన్నిహితులతో పాటు సుధీర్ పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. రష్మీకి నాకు మధ్య స్నేహం మాత్రమే ఉందని సుధీర్ ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన "మోస్ట్ ఎలిజేబుల్ బ్యాచులర్" చిత్రంలో హీరో అఖిల్ కి సుడిగాలి సుధీర్ స్నేహితుడిగా నటించి మరోసారి తెలుగు పేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story