ఏకంగా 'బాహుబలి' రేకార్డులపై కన్నేసిన మెగా హీరో

ప్రస్తుతం టాలీవుడ్ మెగా ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. మొట్ట మొదటి...
ప్రస్తుతం టాలీవుడ్ మెగా ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. మొట్ట మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా వంటి స్టార్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం 40 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అంత ఖర్చు పెట్టి కొన్నప్పటికీ సినిమా వసూళ్లు ఎంతో కొంత లాభాలు తెచ్చి పెట్టాలి అంటే ఈ సినిమా 'బాహుబలి' రేంజ్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే బాహుబలి 10 మిలియన్ డాలర్లను ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులో 2.5 మిలియన్ డాలర్లతో 'రంగస్థలం' మొదటి స్థానంలో ఉంది. మరి 'సైరా' సినిమా 'బాహుబలి' రేంజి కలెక్షన్లను నమోదు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT