MAJOR: 'మేజర్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్

MAJOR: మేజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్
x

 'మేజర్' 

Highlights

అడవిశేష్ ప్రధానపాత్రలో 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్నలెటెస్ట్ మూవీ 'మేజర్'.

వైవిద్య చిత్రాల కథానాయకుడు అడవిశేష్, ఆయన ప్రధానపాత్రలో 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో రూపొందుతున్నలెటెస్ట్ మూవీ 'మేజర్'. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు దర్శకనిర్మాతలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర నిర్మాణంలో టాలీవుడ టాప్ హీరో అగ్రకథానాయకుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు భాగం కావడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది.

ఓ వైపు 'మేజర్' సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టిన చిత్రబృందం. చిత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఇప్పటికే పైగా అడవిశేష్ కెరీర్‌లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాల్లో 'మేజర్' ఒకటిగా నిలుస్తుందని రీసెంట్‌గా మహేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ సినిమాకు మంచి బూస్టింగ్ ఇచ్చింది.

సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ఎస్ మూవీస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తుండగా... తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అడవిశేష్ జోడిగా శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శోభితా ధూళిపాళ్ల రోల్ ప‌వ‌ర్‌‌ఫుల్‌‌గా, ఎమోష‌న‌ల్‌‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కానుందని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా జులై 2వ తేదీన విడుదల కానుందని ప్రకటించిన మహేష్ బాబు.. ఆ రోజును 'మేజర్' డే అని తెలపడం గమనార్హం.


Show Full Article
Print Article
Next Story
More Stories