మహాప్రస్థానంలో ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

Uma Maheshwari: అంతిమ సంస్కారాలకు హాజరైన చంద్రబాబు, బాలకృష్ణ

Jyothi
Updated on: 3 Aug 2022 12:00 PM IST
The Last Rites of Uma Maheswari Ended in Mahaprasthanam
X

మహాప్రస్థానంలో ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు

Uma Maheshwari: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిశాయి. ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల కుటుంబం అమెరికా నుంచి తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకుని తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. తొలుత ఆమె ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానానికి చేరుకుంది. అనంతరం అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉమామహేశ్వరి చితికి భర్త శ్రీనివాస ప్రసాద్‌ నిప్పంటించారు. అంతిమ సంస్కారాలకు టీడీసీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ సహా కుటుంబసభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Jyothi

Jyothi

Next Story